విజయనగరం జిల్లాలోని కార్యాలయ భవనాలకు తెలుపు రంగులు వేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో పార్టీ రంగుల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం వల్ల తెలుపు రంగులు వేస్తున్నారు. జిల్లాలోని డెంకాడ, పదతడివాడ, అక్కివరం తదితర గ్రామ సచివాలయ భవనాలకు గతంలో ఉన్న వైకాపా రంగులు తొలగించారు.
సచివాలయ భవనాలకు పార్టీ రంగులు తొలగింపు - విజయనగరం జిల్లా గ్రామ సచివాలయాలు తాజా వార్తలు
హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల మేరకు కార్యాలయ భవనాలకు తెలుపు రంగు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజయనగరం జిల్లాలోని గ్రామ సచివాలయ భవనాలకు పార్టీ రంగులను తొలగించింది.
గ్రామ సచివాలయాలకు శ్వేత రంగులు