ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగనన్న విద్యా కానుకలో కొత్తదనం ఏముంది?'

తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన పథకాన్ని కాపీ కొట్టి 'జగనన్న విద్యా కానుక'గా మార్చారని ఆ పార్టీ ఎమ్మెల్సీ సంధ్యారాణి విమర్శించారు. ఇందులో కొత్తదనం ఏముందని ప్రశ్నించారు. అలాగే గిరిజనులను వైకాపా సర్కార్ మోసం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు.

tdp mlc Sandhya rani
tdp mlc Sandhya rani

By

Published : Oct 8, 2020, 8:03 PM IST

రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు జగనన్న విద్యా కానుక కొత్త పథకం కాదని తెదేపా ఎమ్మెల్సీ సంధ్యారాణి విమర్శించారు. తెదేపా హయాంలో అమలు చేసిన పథకానికే మెరుగులు దిద్ది ఆర్భాటం చేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో హడావుడి అవసరమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు గిరిజనులకు వరమైన జీవో నంబర్ 3ని అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని ఆమె నిలదీశారు.

గిరిజనులకు ఉపాధి కల్పించే ఈ జోవోను త్వరితగతితన అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు వచ్చే సబ్సిడీల్లో వైకాపా సర్కార్ కోత విధిస్తోందని సంధ్యారాణి మండిపడ్డారు. వారికి లబ్ధి చేకూర్చే చంద్రన్న బీమా, 50 ఏళ్లకు పింఛన్, విదేశీ విద్య వంటి అనేక పథకాలు రద్దు చేశారని దుయ్యబట్టారు. వీటిని తిరిగి కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details