విజయనగరం జిల్లా కొమరాడ మండలం సోమినాయుడువలస సమీపంలోని పొలాల్లో ఓ ఈతచెట్టు విరగ్గాసింది. చెట్టుకు ఆకులున్నా.. ఒక్క మట్ట కూడా లేదు. దూరం నుంచి చూస్తే కాయలే పచ్చగా ఆకుల్లా కనిపిస్తున్నాయి. చెట్టంతా ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు ఉండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పార్వతీపురం ఐటీడీఏ పీహెచ్‌వో మణిభూషణ్ దృష్టికి తీసుకెళ్లగా ఈ మట్టలు తొలగించడం వల్ల గెలల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
చెట్టంతా కాయలే.. చూస్తే అదరహో అనాల్సిందే!
Wonder Tree: ఎండాకాలం వచ్చిందంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేవి మామిడి, తాటిముంజలు, ఈతపండ్లు. ఈతచెట్లు ఓ దశకు చేరిన తర్వాత కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి. అయితే ఓ చెట్టు మాత్రం మట్టలు లేకుండా.. చిన్నగా ఉండి విరగ్గాసింది. దూరం నుంచి చూస్తే కాయలే ఆకులను తలపిస్తున్నాయి.
విరగ్గాసిన 'ఈత'.. చూస్తే అదరహో అనాల్సిందే