హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఉడిపి పీఠాధిపతి శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ పేజ్వర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో నీలాచలం కొండపై ధ్వంసమైన శ్రీ కోదండ సీతారాముల విగ్రహాలను ఆయన పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. ఆలయ దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ఉడిపి పీఠాధిపతి తెలిపారు.
'ఆలయాల్లో దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం'
ఏపీలో ఆలయాల్లో దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ఉడిపి పీఠాధిపతి శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ పేజ్వర్ తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో నీలాచలం కొండపై ధ్వంసమైన శ్రీ కోదండ సీతారాముల విగ్రహాలను ఆయన పరిశీలించారు. సమాజంలో శాంతిస్థాపన ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని గుర్తు చేశారు.
sri vishwa prasanna theertha swamiji