దేవాలయాల్లో దాడుల వెనుక భాజపా హస్తం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఘటనకు కారకులైన వారిని వదిలేసి తమపై ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. విజయనగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా అధికార ప్రతినిధిలా డీజీపీ మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలీసులే ఈ కేసులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దేవాలయాల ధ్వంసం, తమ పార్టీ నేతలతో పోలీసుల తీరుపై ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకి తెలియజేశామన్నారు.
ఏపీ పోలీసుల తీరును అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాం: మాధవ్ - DGP gowtham sawang news
ఆలయాలపై దాడుల కేసులను పోలీసులే పక్కదారి పట్టిస్తున్నారని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఘటనకు కారకులైన వారిని వదిలేసి తమపై ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. పోలీసుల తీరును కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామన్నారు.
Bjp_Mlc_Madhav