విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో వంద పడకల కొవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు అధికారులు. ఆ విభాగంలో పని చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు ముందుకు రాలేదు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్నానాల గదుల్లో రోగుల వాడుక నీరు.. వార్డుల్లోని మంచాల వద్దకు చేరింది.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు సూపరింటెండెంట్ వాగ్దేవి పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కొవిడ్ విభాగంలో పని చేసే వారికి రెండింతలు జీతం మరుసటి రోజు సెలవు ఇస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని.. అంతవరకు పనులు చేయాలని కోరారు. అందుకు సిబ్బంది అంగీకరించటంతో పారిశుద్ధ్య పనులు ప్రారంభమయ్యాయి. దీంతో రోగులు ఇబ్బంది తాత్కాలికంగా గట్టెక్కినట్లైంది.