ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్ష్యం కొండెక్కింది... తలుపు పొయ్యెక్కింది - విజయనగరం గిరిజన ప్రజల బాత్రూన్ కష్టాలు

వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం ఏజెన్సీలో నీరుగారుతోంది. శిఖరాగ్ర గ్రామాల్లో వీటిని తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, గిరిజనుల్లో అవగాహన లేమితో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ మరుగుదొడ్లు నిరుపయోగమవుతున్నాయి. వీటి ఏర్పాటుకు అందించిన సామగ్రిని వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా వాడుతున్నారు.

అద్వాన్నంగా మారిన గిరిజన మరుగుదొడ్లు

By

Published : Nov 24, 2019, 1:31 PM IST

అద్వాన్నంగా మారిన గిరిజన మరుగుదొడ్లు

విజయనగరం జిల్లా సాలూరు మండలం శిఖరాగ్ర గ్రామమైన గొందివలసలో ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం ఇచ్చిన సామగ్రిని గిరిజనులు వాళ్ల అవసరాలకు వినియోగించుకుంటున్నారు. తలుపులను పొయ్యిపై మూతగా, ఇనుప రేకులను పశువుల శాలకు రక్షణగా వాడుతన్నారు. ప్రభుత్వం 'మరుగుదొడ్లు వినియోగించండి.. స్వచ్ఛభారత్' అనే నినాదాలు ఈ గ్రామంలో నోటిమాటకే పరిమితమయ్యాయి. మరుగుదొడ్లు గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోతున్నాయి. అన్ని గ్రామాలలో సిమెంట్​తో కట్టి... మాలాంటి వాళ్లకు లోకజ్ఞానం తెలీదనీ 49 పనికిరాని మరుగుదొడ్లను నిర్మించారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు వద్దంటే... మీకు నచ్చితే వాడండి లేకపోతే లేదని అధికారులు చెప్పారని వాపోతున్నారు.

అంతేకాకుండా గ్రామంలో నీళ్ల ట్యాంక్​ ఉన్నా నీళ్లు రావని గ్రామస్థులంటున్నారు. కుళాయి దిమ్మలు కట్టారు కానీ నీరు మాత్రం రావడం లేదంటున్నారు. ఎన్నికల ముందు ఓట్లు అడగడానికి వస్తారే తప్ప కష్టాలు పట్టించుకునే నాథుడే లేరని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details