ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ చిత్రపటానికి వాలంటీర్ల దండం..! - cm jagan latest news

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో గ్రామ, నగర పంచాయతీ వాలంటీర్లు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి చిత్ర పటానికి వంగివంగి దండాలు పెట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

Volunteers to shoot CM pics
సీఎం జగన్ చిత్రపటానికి వాలంటీర్ల దండం

By

Published : Apr 25, 2020, 12:38 AM IST

సీఎం జగన్ చిత్రపటానికి వాలంటీర్ల దండం

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా... పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించింది. అయితే... ఇంటింటి సర్వే, బాధితుల గుర్తింపు తదితర కార్యక్రమాల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని భావించిన సీఎం జగన్... వారికి బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నెల్లిమర్లకు చెందిన వాలంటీర్లు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేసే ప్రక్రియలో భాగంగా... ఆయన చిత్రపటానికి దండాలు పెట్టారు. పురాతన పద్ధతిలో వాలంటీర్లు సీఎం జగన్ చిత్రపటానికి వంగివంగి నమస్కరించటం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details