ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో స్వచ్ఛంద లాక్​డౌన్​.. - కరోనా కాలంలో విజయనగరంలో స్వచ్ఛంద లాక్​డౌన్​ తాజా అప్ డేట్స్

కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి జోరందుకున్న నేపథ్యంలో గతేడాది పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజల్లో కలవరం మొదలైంది. విజయనగరం జిల్లాలో వ్యాపార, వాణిజ్య కేంద్రాల నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నియంత్రణకు తమవంతు సహకారంగా స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నారు.

voluntary lock down
వ్యాపార, వాణిజ్య కేంద్రాల నిర్వహకుల స్వచ్ఛంద లాక్​డౌన్​

By

Published : Apr 20, 2021, 2:57 PM IST

రాష్ట్రంలో గతేడాది కరోనా కేసులు నమోదైన నాటి నుంచి 45 రోజుల పాటు గ్రీన్ జోన్ జిల్లాగా విజయనగరం రికార్డు సాధించింది. ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. కరోనా సెకండ్ వేవ్ లో రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమవుతోంది. ఇప్పటికే జిల్లాలో బాధితుల సంఖ్య 1609కు చేరింది. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా.. గ్రామీణులు కరోనాకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

వర్తక, వాణిజ్య సంఘాలు స్వచ్ఛంద లాక్ డౌన్..

ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి జిల్లా యంత్రాగం సన్నద్దమైంది. కొవిడ్ నియంత్రణకు వర్తక సంఘాలు మేము సైతం అంటూ ముందుకొచ్చాయి. జిల్లాలోని వర్తక, వాణిజ్య సంఘాలు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నాయి. బొబ్బిలి పట్ణణం వర్తక సంఘాలు ఈ నెల 15 నుంచి లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచుతున్నారు. 2 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు దుకాణాలన్ని మూతపడుతున్నాయి.

ఆటోలు, ట్రక్కు డ్రైవర్లు సైతం రాకపోకలు నిలిపివేత..

కేవలం పాలు, పెరుగు, మెడికల్ షాపులు మాత్రమే తెరుచుకుంటున్నాయి. ఆటోలు, ట్రక్కు డ్రైవర్లు సైతం రాకపోకలను నిలిపివేస్తున్నారు. పార్వతీపురం, గజపతినగరం వర్తక సంఘాలూ ఇదే బాట పట్టాయి. జిల్లాలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సైతం 21 నుంచి 30 వరకు స్వచ్ఛందంగా లాక్​డౌన్ ప్రకటించారు. వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

సరిహద్దుల్లో ఒడిశా ప్రభుత్వం ఆంక్షలు..

రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోందన్న కారణంతో.. ఒడిశా ప్రభుత్వం సరిహద్దుల్లో ఆంక్షలు విధించింది. ప్రత్యేక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి రెవిన్యూ, పోలీసు, వైద్య గ్య శాఖ ఉద్యోగులు జిల్లా వైపు నుంచి వెళ్లిన వాహనాలను తనిఖీలు చేసి., వాటిలోని వ్యక్తులను పరీక్షలు చేస్తున్నారు. ఎవరికైనా సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే.. వెనక్కి పంపుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఆరు ఆర్టీసీ బస్సులు ఒడిశాకు వెళ్తాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ ఆర్టీసీ బస్సులనూ నిలుపుదల చేశారు.

ఇవీ చూడండి...:విజయనగరంలో జగనన్న విద్యా దీవెన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details