ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

10 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - latest ration rice seized in vizianagarm dst

విజయనగరం జిల్లా భోగాపురంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పది టన్నులకు పైగా బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా తనిఖీలు చేశారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

viziznagaram dst polcie seized ration rice in bhogapuram
viziznagaram dst polcie seized ration rice in bhogapuram

By

Published : May 12, 2020, 11:50 AM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండలం రీసుపేట ప్రాంతం నుంచి సుమారు పది టన్నులకు పైగా వెళ్తున్న రేషన్ బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని కొన్ని ప్రాంతాలను ముందస్తుగా వీరు తెలుసుకొని అక్కడ ఇంటింటికి వెళ్లి వారి నుంచి పీడీఎస్ బియ్యం కిలో 12 నుంచి 15 రూపాయల వరకు ఇచ్చి సేకరిస్తారు.

వీటిని పెద్ద మొత్తంలో ఒకేసారి వాహనంలో తీసుకెళ్లి విజయనగరం పట్టణానికి చెందిన అశోక్ రాజు అనే వ్యక్తికి అందజేస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్ఐ.మహేష్ తెలిపారు. వీటి వెనుక ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇలా పక్కదోవ పట్టేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details