విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కిశోర్‌కుమార్ అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ భూసేకరణకు సంబంధించి ప్రత్యేక ఉప కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన భూములు, ఇంకా సేకరించాల్సినవి, బాధితులకు, రైతులకు ఇచ్చిన పరిహారం, కోర్టు కేసులు, వాటి స్థితిగతులను గురించి చర్చించారు.
'భోగాపురం విమానాశ్రయ భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి' - భోగాపురం విమానాశ్రయం తాజా వార్తలు
భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణపై.. జిల్లా అధికారులతో విజయనగరం జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ సమీక్ష నిర్వహించారు. సమస్యలు ఏమైనా ఉంటే త్వరితగతిన పరిష్కరించి వీలైనంత త్వరగా భూమిని అప్పగించాలని సూచించారు.
జేసీ మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి 2,700 ఎకరాలను సేకరించామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ భూముల్లో 2,200 ఎకరాలు విమానాశ్రయ నిర్మాణానికి, మిగిలిన 500 ఎకరాలు అభివృద్ధి కోసం కేటాయిస్తారని చెప్పారు. ఈ భూములకు సంబంధించి ఇంకా కొన్ని కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయని, ఇవి వేగంగా పరిష్కారం అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు సంబంధించి సమస్యలు ఏమైనా మిగిలి ఉంటే, వాటిని తక్షణమే పరిష్కరించి, వీలైనంత త్వరగా భూమిని అప్పగించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఇవీ చదవండి... మాస్కు లేకపోతే జరిమానా తప్పదు.. కృష్ణా జిల్లాలో అమలు...