Sravani Samanthapudi: ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలన్నదే ఆమె తత్వం. అదే ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘బ్యాంకాక్ పిల్ల’ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి సంవత్సరం పూర్తి కాకముందే.. లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే, ఈ విజయం ఒక్కరోజుది కాదు.. ఎన్నో ఏళ్ల కష్టముంది. ఆమె పుట్టి పెరిగిందంతా విజయనగరంలో. వాళ్ల నాన్న శ్రీనివాసరాజు, అమ్మ పార్వతి. ఆమెకు బీటెక్ చివరి సంవత్సరంలో పెళ్లయ్యింది. ఆమె భర్త పేరు నాగేంద్రవర్మ.. అతను ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసేవారు. ఆమె చదుపు పూర్తైన తర్వాత.. హైదరాబాద్‌లో వాళ్ల ఆయన దగ్గరకు వెళ్లి పోయారు.
అప్పటివరకూ ఆడుతూ, పాడుతూ గడిపేసిన ఆమెకు.. ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ఈ సమయంలో ఈటీవీ ‘స్టార్ మహిళ’ ఆడిషన్స్‌కి వెళ్లి విజయం సాధించారు. తర్వాత వీరికి కుతూరు జన్మించింది. ఆ పాప పుట్టిన కొద్ది రోజులకే.. ఆమె భర్తకు థాయ్‌లాండ్‌లో పని చేసే అవకాశం రావటంతో అక్కడికి వెళ్లారు.
మొదట వ్యూస్ పెరగలేదు :ఆమె థాయ్‌లాండ్‌కి డిపెండెంట్ వీసా మీద వెళ్లడటంతో.. ఆమె అక్కడ ఉద్యోగం చేయటానికి వీలు కాలేదు. రోజు మొత్తంలో చాలా ఖాళీ సమయం దొరికేది. ఈ సమయంలో పిల్లలతో గడిపే ప్రతి సందర్భాన్నీ వీడియోలు తీయటం ప్రారంబించారు. ఆమెకు వీడియోలు ఎడిటింగ్ చేయటమంటే మహా ఇష్టం.. ఆ ఆసక్తే ఆమెను యూట్యూబ్ ఛానెల్ వైపు మళ్లించింది. ప్రారంభంలో ఆమె పాప వీడియోలూ, తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్.. అంటూ వరుసగా నాలుగు ఛానెళ్లను ప్రారంభించారు. అయితే, ఇవన్నీ ఏదో సంపాదిద్దామని కాదు.. నేనేం చేయగలనో చూద్దామని మాత్రమే ప్రారంభించనని ఆమె అంటున్నారు. కానీ సబ్‌స్క్రైబర్లూ, వ్యూస్ పెరగలేదని.. ఆమె కష్టం చూసిన స్నేహితులు బ్యాంకాక్‌లో ఉంటున్నావు.. కొత్తగా ప్రయత్నించమనటంతో ఆమెను ఆలోచనలో పడేసిందంటున్నారు. ఈలోపు ఆమెకు బాబు ఇషాన్ పుట్టాడు.