లాక్డౌన్ కారణంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని... విజయనగరం జిల్లా ఎస్పీ రాజాకుమారి అన్నారు. నిరంతరం కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న ఎస్పీ... విజయనగరం పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో పేద ప్రజలకు నిత్యావసర సరకులను అందజేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తులు సూచించారు. ప్రజలు ఎంతో అవసరమైతే గాని బయటకు రావద్దని, మాస్క్లు తప్పని సరి ధరించి... భౌతికదూరం పాటించాలని సూచించారు.
పేదలకు నిత్యావసరాలు అందజేసిన ఎస్పీ - పేదలకు సరుకులు పంపిణీ చేసిన విజయనగరం ఎస్పీ
కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు... విజయనగరం జిల్లా ఎస్పీ రాజాకుమారి నిత్యావసర సరకులను అందజేశారు. అనంతరం కరోనా కట్టడికి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
![పేదలకు నిత్యావసరాలు అందజేసిన ఎస్పీ vizianagaram sp rajakumari distributes essential commodities to needy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7238443-894-7238443-1589725159912.jpg)
పేదలకు నిత్యావసర సరుకులు అందజేసిన విజయనగరం ఎస్పీ