ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మతసామరస్యం పాటించండి: ఎస్పీ రాజకుమారి - మత పెద్దలతో విజయనగరం జిల్లా ఎస్పీ సమావేశం

మతసామరస్యం పాటిస్తూ అందరూ కలిసి మెలిసి మెలగాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి మతపెద్దలకు సూచించారు. అన్ని మతాల పెద్దలతో సమావేశమైన ఆమె... ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఎస్పీ రాజకుమారి
ఎస్పీ రాజకుమారి

By

Published : Sep 14, 2020, 6:57 PM IST

మత విద్వేషాలు, వైషమ్యాలు లేకుండా అన్ని మతాలు సామరస్యపూర్వకంగా మెలగాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి కోరారు. విజయనగరం పోలీస్ బ్యారెక్స్​లో అన్ని మతాల పెద్దలలో ఎస్పీ సమావేశమయ్యారు. అన్ని ప్రార్థనా మందిరాలలో వాచ్​మెన్లను నియమించుకోవాలని, సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు పరికరాలు, లైట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details