ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ మహిళల టీ-20 లీగ్ విజేతగా.. "విజయనగరం రాయల్స్"

ఏపీ మహిళల టీ-20 లీగ్ విజేతగా "విజయనగరం రాయల్స్" నిలిచింది. విజయనగరం జిల్లా చింతలవలసలో జరిగిన మ్యాచ్​లో "వైజాగ్ డాల్ఫిన్స్"​పై విజయం సాధించింది. విజేతలకు మంత్రి రోజా బహుమతులు అందజేశారు.

By

Published : Jul 3, 2022, 7:58 PM IST

విజయనగరం రాయల్స్
విజయనగరం రాయల్స్

విజయనగరం జిల్లా చింతలవలస పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మహిళా టీ-20 ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్​లో విజయనగరం రాయల్స్ విజయం సాధించింది. ఫైనల్లో వైజాగ్ డాల్ఫిన్స్​ జట్టును రాయల్స్ ఓడించారు. ఈ మ్యాచ్​కు క్రీడాశాఖమంత్రి రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గెలుపొందిన జట్టుతో పాటు రన్నరప్​ జట్టుకు మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ..లీగ్​లో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ విన్నరే అని అన్నారు. మహిళలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఆడ పిలల్లు ఆత్మాభిమానంతో ముందుకు వచ్చి సమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

మహిళలకు క్రీడల పరంగా సరైన ఆదరణ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో సీఎం జగన్ ఇలాంటి టోర్నమెంట్ ఉండాలని ఆదేశించారని రోజా వెల్లడించారు. వెనువెంటనే ఏసీఏ ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసిదంని తెలిపారు. ఏసీఏ సపోర్ట్​తో ఆంద్రాకు చెందిన కల్పన, మేఘన, స్నేహ ఇండియా టీమ్​కు ఎంపికయ్యారని తెలిపారు. మరికొంత మంది కూడా ఇండియా టీమ్​కి ఆడాలని కోరుతున్నామన్నారు.

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహించటం అభినందనీయమని సాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. రాజకీయమైనా, స్పోర్ట్స్ అయినా ట్రెండ్​కు తగ్గట్టు అప్డేట్ అవ్వాలన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపిస్తే.. ఏపీకి బ్రాండ్ అంబాసిడర్​గా ఉంటారరన్నారు. జీవితంలో కష్టపడి పని చేస్తే ఏ స్థాయికైనా వెళ్లొచ్చన్నారు. ఈ నెల 16 నుంచి పురుషుల టీ-20 లీగ్ కూడా జరుగుతుందని తెలిపారు. ఒక్క క్రికెట్ కాకుండా ప్రతి క్రీడను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రాంఛైజీ వారికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details