కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలన్న సందేశంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో... కరోనా వైరస్ను పోలిన వేషధారణతో సిబ్బంది విజయనగరంలో ఈ ప్రదర్శన చేపట్టారు. గంట స్తంభం నుంచి ప్రారంభమైన ర్యాలీ.. నగరంలోని ప్రధాన వీధుల మీదుగా సాగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలకు మేమున్నాం అన్న భరోసా కల్పించే ఉద్దేశ్యంతో ఈ వినూత్న ర్యాలీ చేపట్టామని ఆమె తెలియచేశారు.
విజయనగరం పోలీసుల వినూత్న ర్యాలీ - కరోనాపై విజయనగరం పోలీసుల ర్యాలీ
కరోనా విజృంభిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. అనే సందేశంతో విజయనగరం జిల్లా పోలీసులు వినూత్నంగా అవగాహన ర్యాలీ చేశారు. కరోనా వైరస్ను పోలిన వేషధారణతో ర్యాలీ నిర్వహించారు. కరోనాపై అవగాహన కల్పించే గీతాలు వినిపించారు. ర్యాలీలో ఎస్పీ రాజకుమారి పాల్గొన్నారు.
విజయనగరం పోలీసుల వినూత్న ర్యాలీ