విజయనగరం పురపాలక సంఘం అధికారులతో శాసనసభ్యులు కోలగట్ల వీరభధ్ర స్వామి సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారి పురపాలక సంఘం కార్యాలయానికి వచ్చిన ఆయనకు కమిషనర్, అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. సమావేశంలో మాట్లాడిన కోలగట్ల వీరభద్ర స్వామి పురపాలక పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, అసంపూర్తి పనులు, నిధుల కేటాయింపులు, తాగునీటి సమస్య, వాటి నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యాల మేరకు పని చేయాలన్నారు. విధుల నిర్వహణలో అవినీతికి తావు లేకుండా...క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలు తెలుసుకోండి: కోలగట్ల - kolagatla
విజయనగరం ఎమ్మెల్యే కోలగోట్ల వీరభద్రస్వామి...పురపాలక సంఘం అధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో మాట్లాడిన ఆయన అవినీతి ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించేదీ లేదని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజాసమస్యలు తెలుసుకోండి: కోలగట్ల
క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజాసమస్యలు తెలుసుకోండి: కోలగట్ల
ఇదీ చదవండి :'రాష్ట్రానికి తలమానికంగా పర్యాటక ప్రాజెక్టులు'