ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి హామీ పనులకు  బాలబాలికలు! - విజయనగరంలో ఉపాధి హామీ పనుల వార్తలు

పిల్లలతో పనులు చేయించుకోకూడదు. 18 సంవత్సరాలలోపు బాలబాలికలను ఏ పనుల్లోకి తీసుకోకూడదు.. అయితే అక్కడ సాక్షాత్తూ ప్రభుత్వ పనుల్లోనే 12, 15 ఏళ్ల పిల్లల్ని వినియోగిస్తున్నారు.

vizianagaram employment guarantee works
ఉపాధి హామీ పనులకు 12, 15 ఏళ్ల బాలబాలికలు!

By

Published : Jun 13, 2020, 12:05 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం వెంకన్నబండ చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో చిన్నపిల్లల్ని తీసుకుంటున్నారు. వారి వయసు 12 నుంచి 15 ఏళ్ల లోపే ఉంటుంది. దీనిపై అక్కడ సిబ్బందిని ప్రశ్నించగా.. వారి తల్లిదండ్రులకు జాబ్ కార్డులు ఉన్నాయని.. వారు పనిలోకి రాకపోవటంతో పిల్లలు వస్తున్నారని చెప్పారు.

బాలబాలికలతో కేంద్రప్రభుత్వ పనులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీఓ సుశీల స్పందిస్తూ ఈ సమస్య తమ దృష్టికి రాలేదని తెలిపారు. తాను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పిల్లలతో పనులు చేయిస్తున్నట్లు తేలితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details