పట్టణంలో ప్రధాన కూడళ్లలో కరోనా వైరస్ భారీ చిత్రం వేసి ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి అంటూ పోలీస్ శాఖ వినూత్నంగా ప్రచారం చేసింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో దేవిగుడి కూడలిలో ఈ మేరకు రహదారిపైనే కరోనా చిత్రాన్ని వేయించారు. పట్టణానికి చెందిన చిత్రకారుడు రఫీ 7 గంటల శ్రమించి ఈ చిత్రం వేశారు. రూ. 7వేలు వెచ్చించి పోలీసు శాఖ సహకారంతో ఈ చిత్రం వేశానని, ప్రజలు బయట తిరుగుతున్నారని, వారిలో అవగాహన కల్పించేందుకు ఈ చిత్రం తోడ్పడితే చాలన్నారు. ప్రపంచ కళ దినోత్సవం రోజు ఈ చిత్రం వేయటం విశేషం.
శృంగవరపుకోట పోలీసుల వినూత్న ప్రయత్నం - corona picture draw on a road by the part of awarness
విజయనగంర జిల్లా శృంగవరపుకోట పట్ణణంలోని ప్రధాన కూడళ్లలో కరోనా వైరస్ చిత్రాలు వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. అంతా ఇంట్లోనే ఉండండి బయటకు రాకండి అంటూ ప్రచారం చేస్తున్నారు.
![శృంగవరపుకోట పోలీసుల వినూత్న ప్రయత్నం vizianagaram dst police done a different way to sprad awarness on corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6798407-434-6798407-1586932114596.jpg)
శృంగవరపుకోట పోలీసుల వినూత్న ప్రయత్నం