విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పెద్దఎత్తున కూరగాయల తోటలు సాగుచేసిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో దిగుబడి లేక నష్టపోయామనుకుంటే... ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నా.. కొనేవారు లేరని ఆందోళన చెందుతున్నారు. కరోనా బూచిని చూపి దళారులు, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏటా ధర ఉంటే పంట ఉండదు. పంట ఉంటే ధర ఉండని పరిస్థితి. ఈ ఏడాది రెండూ ఉన్నా... కరోనా కారణంగా కొనేవారు కరవయ్యారన్నారు. నష్టపోయిన తమకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తోటల్లోనే మగ్గుతున్న కూరగాయలు.. నష్టాల్లో రైతులు - corona updates in vizianagaram dst
కరోనా కట్టడి దిశగా విధించిన లాక్‌డౌన్‌తో రైతులకు తిప్పలు తప్పడంలేదు. లాక్‌డౌన్ ఆంక్షల నుంచి వ్యవసాయ పనులకు సడలింపు ఇచ్చినా... క్షేత్రస్థాయిలో అన్నదాతలు అవస్థలు పడుతూనే ఉన్నారు. విజయనగరం జిల్లాలో కూరగాయల తోటలు సాగుచేసిన రైతులు ఎగుమతులు లేక పంటలను తక్కువ ధరకు విక్రయించుకోవాల్సి వస్తోందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
తోటల్లోనే మగ్గుతున్న కూరగాయలు