విజయనగరం జిల్లాలో కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని.. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. జిల్లాలో ఇప్పటివరకు 36,881 కొవిడ్ టెస్టులు నిర్వహించామని, అ౦దులో 178 పాజిటివ్ వచ్చాయని తెలిపారు. జిల్లాలో ప్రజలు మాస్క్ లు ధరించకు౦డా బయటకు రావద్దని జిల్లా ఎస్పీ రాజకుమారి సూచించారు.
కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి: కలెక్టర్ - covid updates in vizianagaram dst
విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకూ 178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
vizianagaram dst collector press met about corona actions