ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​ నిబంధనలతో పైడితల్లి సిరిమానోత్సవం: డీఎస్పీ - కొవిడ్​ నిబంధనలతో పైడితల్లి సిరిమానోత్స వేడుకలు నిర్వహణ: డీఎస్పీ

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... శ్రీపైడితల్లమ్మ, దసరా ఉత్సవాలు నిర్వహించుకోవాలని విజయనగరం డీఎస్పీ పి. వీరాంజనేయ సూచించారు. ఉత్సవాల నిర్వహణపై చేపడుతున్న చర్యలపై మీడియా సమావేశం నిర్వహించారు.

Vizianagaram dsp press meet on upcoming festivals
కొవిడ్​ నిబంధనలతో పైడితల్లి సిరిమానోత్సవ వేడుకలు: డీఎస్పీ

By

Published : Oct 10, 2020, 5:17 PM IST

పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వాన్ని సంప్ర‌దాయాల ప్ర‌కార‌మే నిర్వ‌హించాల‌ని... అయితే కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవాల్లో భ‌క్తుల రాక‌పోక‌ల‌ను పూర్తిగా నియంత్రిస్తామని విజయనగరం డీఎస్పీ పి. వీరాంజనేయ తెలిపారు. జిల్లాలో శ్రీ పైడితల్లమ్మ, దసరా ఉత్సవాల నిర్వహణపై పోలీసుశాఖ చేపడుతున్న చర్యలపై స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ప‌ట్ట‌ణంలో లైవ్ టెలీకాస్ట్ ద్వారా అమ్మ‌వారి సిరిమానోత్సవాన్ని ప్ర‌సారం చేస్తామని... భక్తులు వారి వీధుల్లోనే వీక్షించాలని కోరారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ... మాస్కుల‌ు ధ‌రించి ఎవరికి వారు కొవిడ్​ నిబంధ‌న‌ల‌ు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

అంతే కాకుండా దసరా ఉత్సవాలకు బొమ్మలు నిలుపుదల చేయకూడని దసరా ఉత్సవాలు చేయకూడదని తెలిపారు. ఈ స‌మావేశంలో ఆయనతోపాటు ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహన రావు, 1వ పట్టణ సీఐ శ్రీనివాస రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

'ఎక్కడ భూములు కనిపించినా గద్దల్లా వాలిపోతున్నారు'

ABOUT THE AUTHOR

...view details