విజయనగరం జిల్లా కురుపాం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై... 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి జిల్లా సబ్ కలెక్టర్ విధేకర్ స్పందించారు. మండలంలో ఉన్న పలు పాఠశాలలను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లేని మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంలో దర్యాప్తు జరుపుతామని తెలిపారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకనుంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటాం' - విజయనగరం జిల్లా నేటి వార్తలు
విజయనగరం జిల్లా కురుపాం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అంశంపై 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి స్పందించి... సబ్ కలెక్టర్ పలు పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటాం'