విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కోమరాడ మండలం దుగ్గి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఆవు, దూడపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఆవు, దూడ మరణించాయి. అర్ధరాత్రి వేళ గ్రామంలో ఏనుగులు సంచరిస్తుడటంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి దాడులకు పాల్పడుతున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వాటిని అడవుల్లోకి తరిమివేయాలని కోరుతున్నారు.
అర్ధరాత్రి ఏనుగుల బీభత్సం.. ఆవు, దూడ మృతి - Vizianagaram district residents are angry that elephants are harassing them at midnight
విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి సమయంలో దుగ్గిరాల గ్రామంలో ఆవు, దూడపై దాడి చేసి.. చంపాయి. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే ఏనుగులను అడవుల్లోకి తరిమివేయాలని కోరుతున్నారు
elephants