ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదృశ్యమైన యువకుడు.. శవమై కనిపించాడు.. రాజాంలో ఉద్రిక్తత

Menthipet SC Colony tenstion atmosphere: గత నెల 19వ తేదీన మిస్సింగ్ కేసుగా నమోదైన విజయనగరం జిల్లా రాజాం మండలం మెంతిపేట ఎస్సీ కాలనీకి చెందిన దేవులపల్లి వెంకటేష్ (25) కేసును పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 18వ తేదీన రాజా మండలం గోపాలపురం గ్రామం సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ కుళ్లిన మృతదేహాం కనిపించిందని.. మృతదేహం వద్ద ఉన్న దుస్తులను, వస్తువులను బట్టి తల్లిదండ్రులు వెంకటేష్‌గా గుర్తించారని ఘటన వివరాలను అధికారులు వెల్లడించారు.

Menthipet SC Colony
Menthipet SC Colony

By

Published : Feb 20, 2023, 1:03 PM IST

Menthipet SC Colony tenstion atmosphere: విజయనగరం జిల్లా రాజాం మండలం మెంతిపేట ఎస్సీ కాలనీకి చెందిన దేవులపల్లి వెంకటేష్ (25) అనే యువకుడి అనుమానాస్పద మృతి ఉద్రిక్తకు దారి తీసింది. గత నెల 19వ తేదీ నుంచి కనిపించకుండపోయిన వెంకటేష్.. ఫిబ్రవరి 18వ తేదీన రాజా మండలం గోపాలపురం గ్రామం సమీపంలో కుళ్లిన శవమై కనిపించాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు, బంధుమిత్రులు యువకుని మృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. మెంతిపేట కాలనీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్తూ మెంతిపేట కాలనీ వాసులపై కొంత మంది యువకులు దాడులు చేశారు. బాణాసంచా కాల్చుతూ, రాళ్లను రువ్వి భయానక వాతావరణం సృష్టించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడుల్లో మెంతిపేట కాలనీకి చెందిన కొందరి ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నెల 19వ తేదీన విజయనగరం జిల్లా రాజాం మండలం మెంతిపేట ఎస్సీ కాలనీకి చెందిన దేవులపల్లి వెంకటేష్ (25) కనిపించటం లేదని అతని తల్లిదండ్రులు అప్పలస్వామి, పార్వతులు జనవరి 23వ తేదీన రాజం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంకటేష్ ఆచూకీ గాలించటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 18వ తేదీన రాజా మండలం గోపాలపురం గ్రామ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహాం లభించింది. మృతదేహం వద్ద ఉన్న దుస్తులను, వస్తువులను బట్టి తల్లిదండ్రులు గుర్తించారు. అనంతరం తమ కుమారుడు మృతిపై అనుమానాలు ఉన్నాయని, న్యాయం చేయాలంటూ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వెంకటేష్ మృతితో రగిలిపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు.. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్తుండగా మెంతిపేట కాలనీ వాసులపై కొంతమంది యువకులు దాడులు చేశారు. బాణాసంచాలు కాల్చుతూ, రాళ్లను రువ్వి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ దాడుల్లో మెంతిపేట కాలనీకి చెందిన కొందరి ఇళ్లు, కార్లు దెబ్బతిన్నట్లు పోలీసులు దాడి వివరాలను తెలియజేశారు.

మరోవైపు వెంకటేష్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు ర్యాలీని చేపట్టాయి. వెంకటేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు గానీ, దాడులు గానీ, వివాదాలు జరగకుండా పోలీసులు పహారా కాశారు.

అదృశ్యమైన మెంతిపేట యువకుడి మృతదేహాం లభ్యం..

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details