ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు' - vizianagaram pydithalli ammavaru festival 2020

విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను కొవిడ్ నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ వెల్లడించారు. సిరిమానోత్సవం రోజున నగరంలో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తామన్నారు.

pydithalli ammavaru festival 2020
pydithalli ammavaru festival 2020

By

Published : Oct 17, 2020, 4:53 PM IST

విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను కొవిడ్ నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ వెల్లడించారు. మాస్కు ధరిస్తేనే భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 26,27న జరిగే పైడితల్లి ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల అనుమతి తదితర అంశాలపై తన కార్యాలయంలో కలెక్టర్ హరి జవహర్ లాల్... ఎస్పీ రాజకుమారి, విజయనగరం శాసనసభ్యుడితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

కొవిడ్ పరిక్షల్లో నెగెటివ్ వచ్చిన వారినే సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు అనుమతిస్తామం. సిరిమానోత్సవం రోజున నగరంలో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తాం. ఆ రోజున ఇతర జిల్లాలకు చెందిన వాహనాలతో పాటు వ్యక్తులను కూడా నగరంలోకి అనుమతించం. మరోవైపు కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది విజయనగర ఉత్సవాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నాం- హరి జవహర్ లాల్, విజయనగరం జిల్లా కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details