జిల్లాలో సుమారు 50 వేల ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేయనున్నట్లు విజయనగరం పాలనాధికారి ఎం. హరి జవహర్‌లాల్ అన్నారు. సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన... గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.
'గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది' - విజయనగరం జిల్లా నేటి వార్తలు
విజయనగరం కలెక్టరేట్లో జిల్లాస్థాయి సమావేశం జరిగింది. జిల్లా పాలనాధికారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీపై చర్చ జరిగింది.
విజయనగరం కలెక్టరేట్లో జిల్లాస్థాయి సమావేశం
ఏళ్ల తరబడిగా గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కు కల్పించి, ఆయా భూముల అభివృద్దికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పట్టాల పంపిణీకి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి... ఈ నెల 22న సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: