ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సంచార ఏటీఎంను జిల్లా పాలనాధికారి డా.ఎం.హరిజవహర్‌లాల్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో బ్యాంకింగ్ లావాదేవీలను పెంపొందించడానికి సంచార ఏటీఎంలు ఎంతో తోడ్పడతాయని కలెక్టర్ తెలిపారు. రైతులకు, కార్మికులు తమ ఖాతాల్లోని డబ్బులు జమ చేయడం, ఉపసంహరించుకోవడం వంటి నగదు లావాదేవీలను చేసుకోవచ్చని సూచించారు.
సంచార ఏటీఎంను ప్రారంభించిన కలెక్టర్ - విజయనగరం జిల్లా నేటి వార్తలు
విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీజీవీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంచార ఏటీఎంను జిల్లా పాలనాధికారి ప్రారంభించారు.
సంచార ఏటీఎంను ప్రారంభించిన కలెక్టర్