ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తాం'

వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.

vizianagaram district collector hari jawahar lal visit crops
పంట పొలాలను పరిశీలిస్తున్న విజయనగరం కలెక్టర్

By

Published : Oct 25, 2020, 1:40 PM IST

విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్ట పోయిన రైతులందరికీ పరిహారం చెల్లించడానికి అన్ని చర్యలు చేపడతామని కలెక్టర్ హరి జవహర్​లాల్ తెలియచేశారు. గొల్లలపాలెంలో పాడైన పంటలను పరిశీలించారు. తమ్మయ్య చెరువు ఆయకట్టు కొత్తకాపుపేటలో 12 ఎకరాలు, గొల్లలపేటలో 2 ఎకరాల వరి పంట నీట మునిగిందని రైతులు కంచే నాయుడు, రాజేష్ కలెక్టర్ ముందు వాపోయారు.

కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు రావలసిన నష్ట పరిహారాన్ని చెల్లిస్తామన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. జిల్లాలో 40 హెక్టార్లలో వరి, 50 హెక్టార్లలో మొక్కజొన్న, 97 ఎకరాలలో పత్తి పంటలకు నష్టం జరిగినట్లు ప్రాధమికంగా అంచనా వేశామన్నారు. నష్టాన్ని ఈ-క్రాప్​లో నమోదు చేయాలని.. బాధిత రైతులు, పంట నష్టం వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని వ్యవసాయాధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details