విజయనగరం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు 50రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్థానిక కలెక్టర్ హరి జవహర్ లాల్ వెల్లడించారు. కోవిడ్‌ను ఎదుర్కోవటంలో జిల్లా యంత్రాంగం మెరుగ్గా పనిచేసిందని గుర్తుచేశారు. వివిధ శాఖల సమన్వయంతో, పటిష్టమైన ప్రణాళికను అమలు చేసినందుకే మహమ్మారిని అదుపు చేయగలిగామని వివరించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గిపోతున్నప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఉత్తరాది, దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ రెండోదశ మొదలయ్యిందని హెచ్చరించారు. కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించి జిల్లాను గ్రీన్‌జోన్‌గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రెండో దశ మొదలవ్వకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు 37శాఖల సమన్వయంతో 50రోజుల ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇతర జిల్లాలతో పోలిస్తే...