విజయనగరం జిల్లా భోగాపురం మేజర్ పంచాయతీల్లో రేషన్ సరుకులు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా రేషన్ సరుకులు అందటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు విన్నవించగా.. వారు నిన్న సాయంత్రం వాహనాన్ని బీసీ కాలనీకి పంపించారు.
కానీ... సిగ్నల్ సమస్యలతో గంటలకొద్దీ లబ్ధిదారులు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. తహాసీల్దార్ రాజేశ్వరరావు వచ్చి వాహనాన్ని మరోచోటుకు మార్చినా.. సంకేతిక సమస్యలు పరిష్కారం అవ్వలేదు. ఈ కారణంగా అర్ధరాత్రి వరకు సరుకుల పంపిణీ కొనసాగింది.