ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారి అధ్వానం.. రాకపోకలు మహా కష్టం - ఏపీ ఒడిశా రహదారిపై సీపీఎం నిరసన న్యూస్

ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు రహదారి... ఏపీ నుంచి ‍ఒడిశా, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరకు రవాణాకు ప్రధాన దారి. నిత్యం నాలుగు వేల వరకు కేవలం సరకు రవాణా వాహనాల రాకపోకలు సాగే మార్గం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రాష్ట్ర రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని గతంలో ప్రతిపాదించారు. రోడ్డు విస్తరణకు సర్వే సైతం పూర్తిచేశారు. గత నాలుగేళ్ల క్రితం చేసిన ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. విస్తరణ జరగకపోగా., నిరాదరణకు గురవుతోంది.

vizianagaram cpm keaders agitation on road
vizianagaram cpm keaders agitation on road

By

Published : Sep 8, 2020, 3:56 PM IST

ఆంధ్రప్రదేశ్ - ఒడిశా రాష్ట్రాల సరిహద్దు రహదారి గోతులమయంగా మారింది. వాహన చోదకులకు ప్రాణసంకటంగా మారింది. భారీ గోతుల కారణంగా వాహనాలు నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడే రహదారిపై నిలిచిపోతుండటంతో.. రాకపోకలకు గంటల తరబడి అంతరాయం కలుగుతోంది.

విజయనగరం జిల్లా.. ఒడిశా సరిహద్దుల్లోని 36వ రాష్ట్రీయ రహదారి దుస్థితి పై పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న స్పందన కరవైంది. ఈ నేపధ్యంలో సీపీఎం కకొమరాడ మండల నాయకులు వినూత్న నిరసన తెలియజేశారు. కొమరాడ మండలం గుమడ సమీపంలో అంతరాష్ట్ర రహదారిపై నీళ్లు తోడుతూ.. చేపలు పడుతూ.. బురద నీటిలో స్నానం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details