కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ అన్నారు. కొవిడ్ బాధితులకు ప్రభుత్వం అందజేసిన హోం ఐసోలేషన్ కిట్లను ఏఎన్ఎంలకు అందించారు. వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉండి కరోనా సోకిన వారు, ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉన్నవారు, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారుగా విభజించి చికిత్స అందిస్తున్నారని కలెక్టర్ అన్నారు.
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ - విజయనగరం నేటి వార్తలు
కరోనా బాధితులకు ప్రభుత్వం అందించిన హోం ఐసోలేషన్ కిట్లను కలెక్టర్ హరిజవహర్ లాల్ ఏఎన్ఎంలకు అందించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్
వీరి కోసం 14 ప్రభుత్వ, 16 ప్రైవేటు ఆస్ప్రతులను సిద్ధం చేశామని, ప్రస్తుతం 997 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండి, హోం ఐసోలేషన్ సౌకర్యం లేనివారి కోసం ఏడు కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి వారికి ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నామన్నారు.
ఇదీచదవండి.