విజయనగరం జిల్లా మెప్మా ఆధ్వర్యంలో ఏంజెల్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని, మూడు వాహనాలను కలెక్టర్ డాక్టర్. హరి జవహరిలాల్ ప్రారంభించారు. మాస్కులను, శానిటైజర్లను, కరప్రతాలను పంపిణీ చేశారు. అవగాహన ద్వారానే కరోనాకు అడ్డుకట్ట వేయగలమని స్పష్టం చేశారు. ఒకవైపు అవగాహన కల్పిస్తునే, మరోవైపు ప్రజల్లో వ్యాధి నిరోధకతను పెంపొందించడానికి హోమియో మందులను వాడటం, పౌష్టికాహారాన్ని తీసుకొనేలా చేయడం తదితర చర్యలను చేపట్టామని వివరించారు.
'అవగాహనతోనే కరోనాకు కట్టడి సాధ్యం' - జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్
కరోనా నియంత్రణకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులను ధరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ కోరారు. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని, అంతా భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.
అవగాహనతోనే కరోనాకు కట్టడి