విజయనగరం నగర పాలక సంస్థ పాలక వర్గ సమావేశంలో ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని కౌన్సిల్ ఆమోదించింది. మేయర్ వెంపడపు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన పాలక వర్గ సమావేశంలో.. ఈ మేరకు నిర్ణయించారు. ముందుగా డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మికి కౌన్సిల్ సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో 43 అంశాలతో కూడిన ఎజెండాలో 41 అంశాలను కౌన్సిల్ సమావేశం ఆమోదించింది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన జీవో 197,197ఏ, 198, 199 జీఓల ప్రకారం పన్ను పెంపుదలను కౌన్సిల్ ఆమోదించింది. ఆస్తి పన్ను పెంపు నిర్ణయం సరికాదని ప్రజలపై పన్ను భారాన్ని పడకుండా చూడాలని తెదేపా కౌన్సిలర్ కర్రోతూ రాధమని కోరారు.
ఆస్తి పన్ను పెంపుకి విజయనగరం నగర పాలకవర్గం ఆమోదం - Vizianagaram Governing Body Meeting
ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విజయనగరం నగర పాలక కౌన్సిల్ ఆమోదించింది. తెదేపా కౌన్సిలర్ కర్రోతు రాధమని దీనిని వ్యతిరేకించారు. ప్రజలపై పన్నుభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
మేయర్ వెంపడపు విజయలక్ష్మి