విజయనగర జిల్లా సాలూరు మండలంలోని తోణం పంచాయతీలోని వానివలస, మెట్టవలస, బుర్రమామిడి వలస, కొత్తవలస గ్రామాలకు చెందిన యువత గత సంవత్సరం తమకు షెడ్యూల్ కులాల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ఐటీడీఏ పీఓ వినోద్‌కుమార్ వాటిని పరిశీలించి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎమ్మార్వోను ఆదేశించారు.
ఉద్యోగాలు కోల్పోతున్నాం.. ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి' - విజయనగరం గిరిజన యువత
తమకు షెడ్యూల్ కులాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గ్రామీణ గిరిజన యువత.. తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
![ఉద్యోగాలు కోల్పోతున్నాం.. ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి' vizianagaram agency youth apply for schedule certificates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7259418-18-7259418-1589876648333.jpg)
అయితే ఎమ్మార్వో ఏడుగురికి మాత్రమే ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. మొత్తం 180 మంది దరఖాస్తు చేసుకుంటే ఏడుగురికే ఇవ్వడం ఏంటని యువత ప్రశ్నించగా.. 'పై అధికారుల సూచనతోనే వారికి ఇచ్చానని' చెప్పారు. ఆ ఏడుగురు ఉద్యోగాలు చేసుకుంటున్నారని.., తాము మాత్రం ఎమ్మార్వో కారణంగా ఉద్యోగాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మళ్లీ ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి... పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం