విజయనగరం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఎస్పీ రాజకుమారి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్టీసీ అధికారులకు, సిబ్బందికి, కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు సలహాలు అందించారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. లేనిపక్షంలో బస్సు ఎక్కడానికి అనుమతించవద్దని పేర్కొన్నారు.
కరోనా నియంత్రణకు కావలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటిస్తూ.. బస్సులను నడిపిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
'మాస్కు లేకపోతే బస్సు ఎక్కించుకోవద్దు' - మాస్కు లేకపోతే బస్సు ఎక్కించుకోవద్దు
కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. కోవిడ్ 19 నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సూచించారు.
!['మాస్కు లేకపోతే బస్సు ఎక్కించుకోవద్దు' vizayanagaram sp visit rtc complex](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7371446-230-7371446-1590589052623.jpg)
vizayanagaram sp visit rtc complex