విజయనగరం పట్టణంలోని నాగవంశం వీధిలో భాజాపా, వైకాపా నేతల మధ్య జరిగిన దాడి ఘటనపై జిల్లా ఎస్పీ బి.రాజకుమారి విచారణ చేపట్టారు. ఘర్షణకు గల కారణాలు, బాధ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరు గురించి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారు. చట్టాన్ని ఎవరూ చేతిలో తీసుకున్నా వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ప్రతీ ఒక్కరు చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. నాగవంశం వీధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక బలగాలతో గస్తీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
వైకాపా, భాజపా నేతల ఘర్షణపై ఎస్పీ విచారణ - వైకాపా, భాజపా నేతల ఘర్షణపై ఎస్పీ విచారణ
భాజపా, వైకాపా వర్గీయుల మధ్య విజయనగరం పట్టణంలోని నాగవంశం వీధిలో జరిగిన ఘర్షణపై ఎస్పీ రాజకుమారి విచారణ చేపట్టారు. ఘర్షణకు గల కారణాలు, బాధ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వైకాపా, భాజపా నేతల ఘర్షణపై ఎస్పీ విచారణ