విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని క్వారంటైన్ కేంద్రానికి.. ఇతర మండలాలకు చెందిన వ్యక్తులను తీసుకొస్తున్నారన్న సమాచారం... స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు... ఎల్విన్‌పేట కూడలి వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలోకి ఇతరులెవ్వరినీ అనుమతించబోమని కూడలిలోనే బైఠాయించారు. పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
'క్వారంటైన్ కేంద్రానికి ఇతరులను తీసుకురావద్దు' - విజయనగరంలో కరోనా కేసుల వార్తలు
క్వారంటైన్ కేంద్రానికి ఇతరులను తీసుకురావద్దంటూ విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఎల్విన్‌పేట కూడలి వద్దకు చేరుకని నిరసన తెలిపారు. ఇతరులను గ్రామంలోకి అనుమతించబోమని అక్కడే బైఠాయించారు.
vizayanagaram-people-dharana