విజయనగరం లోక్సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిబెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్ధి కోలగట్ల వీరభద్ర స్వామి ఇరువురు కలసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పెద్దఎత్తున వైకాపా స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లారు.ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
చీపురుపల్లి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి నాగార్జున ఎన్నికల ప్రచారం చేశారు. వీరి సమక్షంలో గదబవలస పంచాయతీ నుంచి ఇద్దరు వార్డు మెంబర్లతో సహ 5 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం గూటికి చేరాయి.
పార్వతీపురం లైన్స్ కల్యాణమండపంలో తెదేపా నాయకులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని వ్యాపారులు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు కిషోర్ చంద్రదేవ్, పార్వతీపురం నియోజకవర్గ అభ్యర్థి పాల్గొన్నారు. తెదేపా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఓటును సైకిల్ గుర్తుకే వేసి గెలిపించాలని కోరారు.