రాష్ట్రంలో ఇప్పటికి వరకు కరోనా కేసు నమోదు కానీ విజయనగరం జిల్లాలో... తొలిసారి మూడు కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నా... విజయనగరంలో మాత్రం వ్యాధి వ్యాప్తిచెందలేదు. ఇన్నాళ్లు గ్రీన్‌జోన్‌లో ఉన్న జిల్లాలో ఒకేసారి ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రత్తమైన అధికారులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కేసులు వచ్చిన ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.
విజయనగరం జిల్లాలో కంటైన్మెంట్ జోన్లు
ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లాకూ కరోనా మహమ్మారి సోకింది. ఒక్కసారే 3 కరోనా పాటిజివ్ కేసులు నమోదవటంతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది.
vizayanagaram district collector