ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులే ముద్దంటూ.. వైకాపా బైక్​​ ర్యాలీ - వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ వార్తలు

మూడు రాజధానులకు మద్దతుగా విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి మండలాల్లో వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ చేపట్టారు. వైకాపా పార్టీ కార్యాలయం నుంచి చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

vizainagaram ysrcp leaders bike rally
విజయనగరం జిల్లా చీపురుపల్లిలోవైకాపా నాయకులు ర్యాలీ

By

Published : Jan 23, 2020, 12:11 PM IST

3 రాజధానులకు మద్దతుగా వైకాపా బైక్​ ర్యాలీ

మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుండటం ఎంతో శ్రేయస్కరమని వైకాపా పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి మండలాల్లో వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ చేపట్టారు. విశాఖను రాజధానిగా చేయడం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నుంచి చెన్నై, బెంగళూరుకు వలసలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details