ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 29, 2020, 11:55 PM IST

ETV Bharat / state

'కొవిడ్​తో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం'

కొవిడ్ బారినపడి మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్​.కె.వి. రంగారావు స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ ద్వారా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చని పోలీసులకు సూచించారు.

కొవిడ్​తో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
కొవిడ్​తో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా కరోనా వైరస్​ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్​.కె.వి. రంగారావు స్పష్టం చేశారు. విజయనగరం పోలీసు పరేడ్​ గ్రౌండ్​లో జిల్లా పోలీసులతో సమావేశమైన ఆయన... మూడు నెలల పాటు జిల్లాను కరోనా గ్రీన్​జోన్​గా ఉంచడంలో సఫలీకృతమయ్యారని ప్రశంసించారు.

జిల్లాలో దాదాపు 660 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని... కరోనా నియంత్రణ జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే వైరస్ సోకిందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ ద్వారా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చని పోలీసులకు సూచించారు. కొవిడ్ కారణంగా మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details