కొత్తవలస మేజర్ పంచాయతీ ఓట్ల లెక్కింపు వివాదాన్ని.. తెలుగుదేశం నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడ్డారంటూ విజయనగరంలో కలెక్టర్ హరి జవహార్లాల్కు ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపు జరిగిన తీరుపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. అవసరమైతే.. న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
కొత్తవలస మేజర్ పంచాయతీలో ఆందోళనలు.. శ్రీభరత్ సంఘీభావం
విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ పంచాయతీ ఓట్ల లెక్కింపు వివాదం కలెక్టర్ కార్యాలయానికి చేరింది. ఓట్ల లెక్కింపు విషయంలో ఆర్వో అక్రమాలకు పాల్పడ్డారంటూ.. రెండు రోజులు తెదేపా సర్పంచి అభ్యర్ధి.. ఆయన మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షకు పూనుకున్న ఆయనకు విశాఖ పార్లమెంట్ తెదేపా ఇంఛార్జి శ్రీభరత్ సంఘీభావం తెలిపారు.
కొత్తవలస మేజర్ పంచాయితీలో ఆందోళనలకు శ్రీభరత్ సంఘీభావం
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షకు పూనుకున్న తెదేపా మద్దతుదారులకు విశాఖ పార్లమెంట్ తెదేపా ఇంఛార్జి శ్రీభరత్ సంఘీభావం తెలిపారు. రిలే దీక్ష శిబిరాన్ని సందర్శించి.. మద్దతు తెలిపారు. అనంతరం శృంగవరపుకోట మాజీ శాసనసభ్యురాలు కోల్ల లలితకుమారి... తెదేపా శ్రేణులతో కలసి.. జిల్లా కలెక్టర్ హరి జవహార్ లాల్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
ఇవీ చూడండి...