విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలసలో గ్రామసభలు నిర్వహించాలని గ్రామస్థులు ఆందోళన చేశారు. గ్రామసచివాలయ సిబ్బంది ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకపోవడంతో పలు అభివృద్ధి పనులను పూర్తి కావడం లేదని గ్రామస్థులు మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసే నిధుల వివరాలు తెలపట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు రహదారులు, తాగునీటి పథకాలు, కాలువలు సంబంధించిన పనుల్లో నాణ్యత పాటించడం లేదని వారు ఆరోపించారు. గ్రామసభలు నిర్వహించాలంటూ సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
గ్రామసభలు నిర్వహించాలని కన్నపుదొరవలస గ్రామస్థుల ఆందోళన - కన్నపుదొరవలస తాజావార్తలు
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలసలో గ్రామసభలు నిర్వహించాలని ఆ గ్రామస్థులు ఆందోళన చేశారు. గ్రామసచివాలయ సిబ్బంది అభివృద్ధి పనులను చేయట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
![గ్రామసభలు నిర్వహించాలని కన్నపుదొరవలస గ్రామస్థుల ఆందోళన villagers protest at kannapudoravalasa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7913140-293-7913140-1594033101093.jpg)
కన్నపుదొరవలసలో గ్రామసభలు నిర్వహించాలని గ్రామస్థుల ఆందోళన