ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానికులు అడ్డుకున్నారు.. పోలీసులే పూర్తి చేయించారు! - corona news in nellimarla

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో అమానవీయ సంఘటన జరిగింది. కరోనా బాధిత మృతదేహాన్ని ఖననం చేయకుండా స్థానికులు అడుగడుగునా అడ్డుకున్నారు. చివరికి.. పోలీసుల బందోబస్తు నడుమ కరోనా బాధిత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

villagers prevented corona corpse burial
కరోనా బాధిత మృతదేహ ఖననాన్ని అడ్డుకున్న స్థానికులు

By

Published : Jul 20, 2020, 8:37 PM IST

కరోనా బాధిత మృతదేహ ఖననాన్ని అడ్డుకున్న స్థానికులు

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కరోనా బాధితుడు మృతదేహాన్ని ఖననం చేయకుండా స్థానికులు అడ్డుకున్నారు. విమ్స్ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందే వారి మృతదేహాలను ఖననం చేసేందుకు నెల్లిమర్ల రెవెన్యూ పరిధిలో ఖననం చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో... కొండపేట ప్రాంతంలో ఖననాలు చేసేందుకు ప్రొక్లైన్​తో గుంతలు తవ్వించారు. కరోనా బాధిత మృతదేహాలు తమ ప్రాంతంలో పూడ్చిపెట్టేందుకు వీల్లేదని స్థానికులు అడ్డుచెప్పారు.

చంద్రబాబునగర్ కాలనీ సమీపంలో ఉన్న రిజర్వ్ అటవీ ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా... స్థానికులు అభ్యంతరం చెప్పారు. చేసేది లేక స్థానిక డైట్ ప్రాంతంలో రెవెన్యూ, నగర పంచాయతీ అధికారుల సమక్షంలో అంతిమ సంస్కరాలకు ఏర్పాట్లు మెుదలు పెట్టారు. అక్కడ సైతం అధికారుల్ని అడ్డిగించి... గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో జిల్లా స్థాయి అధికారులు వచ్చి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం కరోనా బాధిత మృతదేహానికి పోలీసుల బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details