నాలుగు నెలలుగా తమకు రేషన్ అందడం లేదని విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీకి చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకొలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బంజ్ దేవ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. వారు గిరిజనులతో కలిసి జేసీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో జేసీ అందుబాటులో లేనందున తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటానికి సిద్ధమేనని తెలిపారు.
గిరిపుత్రులకు అందని రేషన్ బియ్యం..
నాలుగు నెలలుగా రేషన్ అందడంలేదని విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు.
రేషన్ బియ్యం సమస్య