విజయనగరం జిల్లా కోమరాడ మండలం పాతకల్లికోట గ్రామంలో ఇసుకను తరలించే ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. తమకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకను లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న 100 ట్రాక్టర్లను అడ్డుకొని... నదిలోకి వాహనాలు రాకుండా ఉండేందుకు రహదారిపై గోతులు తీశారు.
ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు - పాతకొల్లిపేటలో ఇసుక ట్రాక్టర్లు
నాగావళి నది నిర్వాసిత గ్రామస్థులకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... విజయనగరం జిల్లా పాతకల్లికోట గ్రామస్థులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. తమ అవసరాలకు ఇసుక ఇవ్వటం లేదనీ... అధిక ధరలకు బయట అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు
ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో స్థానికులు సైతం అధిక ధరకు ఇసుకను కొనాల్సి వస్తుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగావళి నది నిర్వాసిత గ్రామస్థులకు ఉచితంగా ఇసుకను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:అప్పలరాజుకు 700ఎకరాలు ఉంది... ఆన్లైన్లో..!
Last Updated : Jun 19, 2020, 12:00 PM IST