ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను ఊరినుంచి వెలివేసిన గ్రామస్థులు

మానవ సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను అక్కడి గ్రామస్థులు ఊరినుంచి వెలివేశారు. ఈ అమానవీయన ఘటన విజయనగరంజిల్లా పాచిపెంట మండలం ఈతమానువలసలో జరిగింది.

eethamanuvalasa village
కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను వెలివేసిన గ్రామస్థులు

By

Published : Jul 10, 2020, 5:12 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఈతమానువలసలో అమానవీయ ఘటన జరిగింది. కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను అక్కడ గ్రామస్థులు వెలివేశారు. ఓ వ్యక్తికి కరోనా రావడంతో అధికారులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడితో సంబంధం ఉన్న 15 మంది కుటుంబసభ్యులను ఆసుపత్రికి తరలించలేదని గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. వెంటనే వారిని ఊరినుంచి వెలివేశారు. చేసేదేం లేక, ఎటువెళ్లాలో తెలియక వారు చిన్నపిల్లలతో సహా ఊరు బయట పశువులపాకలో తలదాచుకున్నారు. రాత్రి వర్షం కురవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై పాచిపెంట మండల తహసీల్దార్‌ విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details