ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రానైట్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని గ్రామస్థులు ఆందోళన - గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు తాజా వార్తలు

బోడకొండ పై గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. పార్వతీపురం మండలం లక్ష్మీ నారాయణపురం సమీపంలో కొండపై తవ్వకాలను ఆపకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే జోగారావు.. గ్రామస్థుల ఆందోళనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

granite mining permits
గ్రామస్థులు ఆందోళన

By

Published : Mar 22, 2021, 7:37 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లక్ష్మీ నారాయణపురం గ్రామస్థులు ఉప కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. బోడకొండపై గ్రానైట్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని కోరారు. తరతరాలుగా కొండను దైవంగా భావించి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు.

పర్యావరణానికి విఘాతం కలిగించేలా కొండపై గ్రంధి తవ్వకాలకు అనుమతి ఇవ్వడం అన్యాయమన్న వారు.. తక్షణం తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగారావు గ్రామస్థుల విన్నపాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details